ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికిన ముక్కా రూపానంద రెడ్డి
రైల్వే కోడూరు (సెప్టెంబర్ 16 జై భీమ్ వాయిస్ టుడే):
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుపతికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విమానాశ్రయం రేణుగుంట/హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు, కుడా సంస్థ అధ్యక్షులు ముక్కా రూపానంద రెడ్డి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసి పూలగుచ్ఛం అందించి ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ అరుదైన సందర్భంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల మహోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రికి రూపానంద రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల క్షేత్ర మహత్యం, బ్రహ్మోత్సవాల విశిష్టతను ప్రతిబింబించేలా సాగిన ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతంతో పాటు ప్రాంతీయ పురోగతికి నిరంతరం శ్రమిస్తున్న నాయకులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. నాటి సత్సంప్రదాయాలను పాటిస్తూ శ్రీవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ లభించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
Andhra
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికిన ముక్కా రూపానంద రెడ్డి
Quick Summary:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికిన ముక్కా రూపానంద రెడ్డి