లింగిరెడ్డిపల్లిలో ఆధ్యాత్మిక శోభ: విఘ్నేశ్వరుని సేవలో ముక్కా వరలక్ష్మి
రైల్వేకోడూరు సెప్టెంబర్ 16 భీమ్ వాయిస్ టుడే:
ఓబులవారిపల్లి మండలం లింగిరెడ్డిపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలు మూడో రోజు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి పూజా మండపాలను రైల్వేకోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి దర్శించారు. మండపానికి చేరుకున్న ఆమెకు ఉత్సవ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, భక్తులు ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విఘ్నేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. చవితి వేడుకలను ప్రజలందరూ భక్తిప్రపత్తులతో, సోదరభావంతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిపరవశం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువత, అధిక సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Andhra
లింగిరెడ్డిపల్లిలో ఆధ్యాత్మిక శోభ: విఘ్నేశ్వరుని సేవలో ముక్కా వరలక్ష్మి
Quick Summary:
లింగిరెడ్డిపల్లిలో ఆధ్యాత్మిక శోభ: విఘ్నేశ్వరుని సేవలో ముక్కా వరలక్ష్మి
