జైభీమ్ వాయిస్ టుడే సెప్టెంబర్ 19//* ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్” లో భాగంగా నందిగామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) ఆవరణలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు సొసైటీ మెంబెర్ ఘంట. వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నందిగామ PACS చైర్మన్ కొట్టె హరికృష్ణ (బద్రి) నందిగామ సొసైటీ కార్యాలయ ప్రాంగణంలో జామ మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు పచ్చని, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు._
_ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.మొక్క నాటడం మాత్రమే కాదు.. దానిని సంరక్షించడం కూడా మన బాధ్యత”అని పేర్కొంటూ, నాటిన ప్రతి మొక్కను క్రమం తప్పకుండా సంరక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ వాసిరెడ్డి సరస్వతి, సొసైటీ మెంబర్ మరియు బీజేపీ నందిగామ మండల అధ్యక్షులు గంటా వెంకట్రావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కటుకూరి. సుందరావు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గోనెల.సత్యనారాయణ, బిజెపి నాయకులు చిరుమామిళ్ల శ్రీనివాసరావు మరియు సొసైటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Andhra
నందిగామ సొసైటీలో మొక్కలు నాటిన కొట్టె హరికృష్ణ*
Quick Summary:
నందిగామ సొసైటీలో మొక్కలు నాటిన కొట్టె హరికృష్ణ.