మంగంపేట వాసులకు నారదాస్ సునీల్ వినాయక చవితి శుభాకాంక్షలు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 14 జై భీమ్ వాయిస్ టుడే: వినాయక చవితి పండగను పురస్కరించుకుని మంగంపేట ప్రజలకు సామాజిక కార్యకర్త నారదాస్ సునీల్ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆకాంక్షించారు. సకల విఘ్నాలను తొలగించి, సర్వజనులకు విజయాన్ని ప్రసాదించే లంబోదరుని పూజను ప్రతి ఒక్కరూ అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని కోరారు.
సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని ప్రార్థిస్తూ, ఈ పవిత్ర పర్వదినం అందరి ఇళ్లలో కొత్త వెలుగులు నింపాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగంపేట ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలంతా ప్రశాంతమైన వాతావరణంలో పండగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Andhra
మంగంపేట వాసులకు నారదాస్ సునీల్ వినాయక చవితి శుభాకాంక్షలు
Quick Summary:
మంగంపేట వాసులకు నారదాస్ సునీల్ వినాయక చవితి శుభాకాంక్షలు