వైభవంగా వినాయక చవితి వేడుకలు: అంకమ్మ నగర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కోరముట్ల శ్రీనివాసులు
రైల్వేకోడూరు సెప్టెంబర్ 16 జై భీమ్ వాయిస్ టుడే:
స్థానిక అంకమ్మ నగర్లో వినాయక చవితి మూడవ రోజు వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర ఆహ్వానం మేరకు అంకమ్మ నగర్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శివలింగానికి పాలాభిషేకం జరిపి, భక్తులకు, నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆధ్యాత్మిక శోభతో పులకించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.
ఈ పూజా కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు మాదినేని వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, కొరముట్ల శేఖర్, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ రాజా (గని), ఎంపీటీసీ బండారు మల్లికార్జున, తొండం రాజేంద్ర, సిద్ధయ్య, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.
Andhra
వైభవంగా వినాయక చవితి వేడుకలు: అంకమ్మ నగర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కోరముట్ల శ్రీనివాసులు
Quick Summary:
వైభవంగా వినాయక చవితి వేడుకలు: అంకమ్మ నగర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కోరముట్ల శ్రీనివాసులు

