Andhra
రైతుల ప్రయోజనం కోసం మున్నేరు కాలువ పూడికతీత పనులు పూర్తి*
Quick Summary:
రైతుల ప్రయోజనం కోసం మున్నేరు కాలువ పూడికతీత పనులు పూర్తి
ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే *శ్రీమతి తంగిరాల సౌమ్య గారి ఆదేశాల మేరకు* చేపట్టిన మున్నేరు కాలువ పూడికతీత పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.పనులు పూర్తైన సందర్భంగా *ఈరోజు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నందిగామ PACS చైర్మన్ కొట్టె. హరికృష్ణ (బద్రి) తెలుగుదేశం పార్టీ నాయకులు దుగ్గిదేవి గోపి కృష్ణ గారు కాలువను ప్రారంభించారు.కాలువలో నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న పూడికను తొలగించడంతో నీటి ప్రవాహం మెరుగుపడి, మున్నేరు నీటిపై ఆధారపడి వరిపంట సాగు చేస్తున్న రైతులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. సాగునీరు సక్రమంగా అందేలా కాలువను అందుబాటులోకి తీసుకురావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతుల సాగునీటి అవసరాలను గుర్తించి, *ఎమ్మెల్యే గారి సొంత నిధులతో మున్నేరు కాలువ పూడికతీత పనులను చేపట్టి పూర్తి చేయించిన ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారికి రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.రైతుల సంక్షేమం, సాగునీటి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తామని నందిగామ PACS చైర్మన్ కొట్టె. హరికృష్ణ (బద్రి) తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు దుగ్గిదేవి గోపి కృష్ణ లస్కర్ బండారు.మోహన్ రావు, , తాటి బాబు , తాటి వెంకటేశ్వర్లు, బొమ్మిశెట్టి రామకృష్ణ, కొనగల ఏడుకొండలు, గ్రామ రైతులు, కూటమి నేతలు పాల్గొన్నారు._