విద్యార్థుల ఆశయాల వేదిక 'కేఎస్ యూఎఫ్' తొమ్మిదో వార్షికోత్సవం
రైల్వే కోడూరు సెప్టెంబర్ 11 జై భీమ్ వాయిస్ టుడే: స్థానిక విద్యార్థి శక్తికి, ఐక్యతకు ప్రతిరూపంగా నిలిచిన కోడూరు స్టూడెంట్స్ యూనియన్ ఫోర్స్ (కేఎస్ యూఎఫ్) తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం పట్టణంలో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు, యూత్ ప్రతినిధులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గాంధీ విగ్రహ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విద్యాపరమైన హక్కుల సాధనలో, సామాజిక సమస్యల పరిష్కారంలో విద్యార్థి లోకం ఎల్లప్పుడూ ముందుండాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర క్రియాశీలకమైనదని, సమాజ శ్రేయస్సు కోసం యువత ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో కేఎస్ యూఎఫ్ అధ్యక్షుడు బండారు మల్లికార్జున్, ఉపాధ్యక్షులు హస్తి భరత్ కుమార్, శ్రీధర్ తో పాటు స్థానిక కళాశాలల విద్యార్థులు, యువత భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
Andhra
విద్యార్థుల ఆశయాల వేదిక 'కేఎస్ యూఎఫ్' తొమ్మిదో వార్షికోత్సవం
Quick Summary:
విద్యార్థుల ఆశయాల వేదిక 'కేఎస్ యూఎఫ్' తొమ్మిదో వార్షికోత్సవం


