మిట్టమీద పల్లె ఎగువపల్లి లో రెండు లక్షల పది వేలకు గణపతి ప్రసాదం దక్కించుకున్న మల్లికార్జున
రైల్వే కోడూరు సెప్టెంబర్ 17 జై భీమ్ వాయిస్ టుడే:రైల్వే కోడూరు మండలం అనంతరాజంపేటలో
భక్తిపారవశ్యం, ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ సాగిన గణనాథుని లడ్డూ వేలం పాట గ్రామంలో విశేష కోలాహలాన్ని నింపింది. వై కోట క్రాస్ రోడ్ అనంతరాజంపేట పరిధిలోని మిట్టమీదపల్లి ఎగుపల్లి గ్రామంలో వెలసిన వినాయకుడి ప్రసాద లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు తీవ్రంగా పోటీపడ్డారు. పోటీ తీవ్రరూపం దాల్చిన తరుణంలో, ఊహించని రీతిలో ముందంజ వేసిన పేరూరు నరసింహులు కుమారుడు పేరూరు మల్లికార్జున అత్యధికంగా రెండు లక్షల పది వేల రూపాయలు పలికి ఈ పవిత్ర ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. స్వామివారి లడ్డూను చేజిక్కించుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేయగా, స్వామి కృపతో గ్రామానికి, తమ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయని భక్తులు ముక్తకంఠంతో ఆకాంక్షించారు. వేలం ముగిసిన అనంతరం ఆధ్యాత్మిక నామస్మరణలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఈ కన్నులపండుగ కార్యక్రమంలో ముద్దపోలు రామసుబ్బయ్య, కస్తూరి శంకరయ్య, ముద్దపోలు శివకుమార్, రామాయణం శ్రీనివాసులులతో పాటు గ్రామానికి చెందిన వృద్ధులు, మహిళలు, గ్రామ పెద్దలు మరియు పెద్ద ఎత్తున యువకులు పాల్గొని వేడుకను జయప్రదం చేశారు.
Andhra
మిట్టమీద పల్లె ఎగువపల్లి లో రెండు లక్షల పది వేలకు గణపతి ప్రసాదం దక్కించుకున్న మల్లికార్జున
Quick Summary:
మిట్టమీద పల్లె ఎగువపల్లి లో రెండు లక్షల పది వేలకు గణపతి ప్రసాదం దక్కించుకున్న మల్లికార్జున
