వైభవంగా శ్రీ అనంతపురమ్మ తల్లి ఆలయ శంకుస్థాపన
రైల్వే కోడూరు సెప్టెంబర్ 6 జై భీమ్ వాయిస్ టుడే: చిట్వేల్ మండలం తిమ్మయ్యగారిపల్లె గ్రామం ఆదివారం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ అనంతపురమ్మ తల్లి ఆలయ శంకుస్థాపన మహోత్సవం భక్తిశ్రద్ధలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా జరిగింది.
ఈ ఆధ్యాత్మిక ఘట్టానికి స్థానిక శాసనసభ్యులు అరవ శ్రీధర్, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, వైఎస్సార్ కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఆయన సతీమణి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ భూమి పూజ సంప్రదాయబద్ధంగా సాగగా, నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అనంతపురమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో తిమ్మయ్యగారిపల్లెతో పాటు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో సుభిక్షంగా విలసిల్లాలని ఆకాంక్షించారు. భక్తుల కొంగుబంగారమై విలసిల్లే ఈ నూతన ఆలయ నిర్మాణం వేగంగా పూర్తయి, సర్వాంగ సుందరంగా భక్తులకు అందుబాటులోకి రావాలని ప్రార్థించినట్లు తెలిపారు.
గ్రామంలో పండుగ వాతావరణం నెలకొల్పిన ఈ మహోత్సవంలో స్థానిక భక్తులు, ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Andhra
వైభవంగా శ్రీ అనంతపురమ్మ తల్లి ఆలయ శంకుస్థాపన
Quick Summary:
చిట్వేల్ మండలం తిమ్మయ్యగారిపల్లె గ్రామం ఆదివారం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ అనంతపురమ్మ తల్లి ఆలయ శంకుస్థాపన మహోత్సవం భక్తిశ్రద్ధలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా జరిగింది.


