నాగవరంలో జోరుగా సాగిన ప్రచార పర్వం
రైల్వే కోడూరు జై భీమ్ వాయిస్ టుడే:
తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేల్ మండలం నాగవరం పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం ఉత్సాహభరితంగా సాగుతోంది. రానున్న ఎన్నికలను పురస్కరించుకుని శుక్రవారం నాగవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.
ప్రచార ప్రారంభానికి ముందు గ్రామంలో వెలసియున్న శ్రీ నాగరప్పమ్మ తల్లి, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రజా సంక్షేమం, స్థానిక ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆలయ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ ప్రచార యాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన శ్రేణులు, స్థానిక ప్రజలతో నాయకులు నేరుగా మమేకమయ్యారు. గ్రామ సర్వతోముఖాభివృద్ధి, స్థానిక మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ప్రజలతో ఆత్మీయంగా చర్చించారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న ఈ ప్రచార పర్యటనలో కూటమి మద్దతుదారులు, శ్రేణులు, కార్యకర్తలు మరియు స్థానిక నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
నాగవరంలో జోరుగా సాగిన ప్రచార పర్వం
Quick Summary:
నాగవరంలో జోరుగా సాగిన ప్రచార పర్వం
