పెద్ద ఓరంపాడులో జోరుగా సాగిన ప్రచార పర్వం
రైల్వే కోడూరు జై భీమ్ వాయిస్ టుడే: ఓబులవారిపల్లి మండల పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గ పరిధిలోని పెద్ద ఓరంపాడు పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కింది. గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అధికారిక అభ్యర్థి వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి స్థానిక శ్రేణులతో కలిసి మధ్యాహ్నం విస్తృతంగా పర్యటించారు. పెద్ద ఓరంపాడుతో పాటు హరిజనవాడ, ఎస్టీ కాలనీల్లో ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తించారు.
ఈ సందర్భంగా ఓటర్లతో నేరుగా మమేకమవుతూ గ్రామాభివృద్ధి, సంక్షేమం మరియు స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చిస్తూ ఓట్లను అభ్యర్థించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అమలైన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, గ్రామ స్వరాజ్య లక్ష్యాలను ప్రజలకు వివరించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలకు తక్షణ పరిష్కారం లభించాలన్నా, గ్రామాల ప్రగతి బాటలో ముందుకు సాగాలన్నా స్థానిక ప్రజాప్రతినిధుల ఎంపిక ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానంతో పాటు ఎంపీటీసీ బ్యాలెట్ సంఖ్య 2 వద్దనున్న ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి విజయాన్ని అందించాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో సాగిన ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు పామూరి రామిరెడ్డి, పామూరి దీపక్ రెడ్డి, చల్లా సురేష్ రెడ్డి, కోట సుబ్బారెడ్డి, పోలి వెంకట్ రెడ్డి, వీరంరెడ్డి సుధాకర్ రెడ్డి, దగ్గు శివరామిరెడ్డి, ఆళ్ల ఈశ్వరయ్య, పసుపులేటి సుబ్బరాయుడు, చలమాల గంగాధర్, మారే సుకుమార్, ముని ప్రతాప్, కొంగాని వెంకటేష్, మోహన్, ప్రభుదాస్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
పెద్ద ఓరంపాడులో జోరుగా సాగిన ప్రచారం
Quick Summary:
పెద్ద ఓరంపాడులో జోరుగా సాగిన ప్రచారం
