వై కోట పంచాయతీలో ముమ్మరంగా సాగిన ఎన్నికల ప్రచారం పాల్గొన్నముక్కా వరలక్ష్మి
రైల్వే కోడూరు జై భీమ్ వాయిస్ టుడే:
రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులువారిపల్లె మండలం పరిధిలోని వై.కోట పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం ఊపందుకుంది. రానున్న ఎన్నికల పర్వంలో భాగంగా గ్రామంలో వివిధ రాజకీయ శ్రేణులు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా స్థానిక నేతలు, ప్రజాప్రతినిధుల ప్రతినిధులు, వివిధ పార్టీల అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా కడప పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి గ్రామానికి విచ్చేయగా, స్థానిక శ్రేణులు మరియు గ్రామస్థులు స్వాగతం పలికారు. కూటమి మద్దతుతో బరిలో ఉన్న వై.కోట మొదటి ప్రాదేశిక నియోజకవర్గ అభ్యర్థి బొబ్బె చందన, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ అభ్యర్థి కీర్తిపాటి కవిత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నాయకులు అరవ శ్రీధర్ నేతృత్వంలో శ్రేణులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.
ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న ఈ ఎన్నికల ప్రచారంలో ప్రతినిధులు వీధివీధినా పర్యటిస్తూ గ్రామ సర్వతోముఖాభివృద్ధి, స్థానిక మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓటర్లతో చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధుల ఎంపిక గ్రామ ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని, ఓటర్లు ఆలోచించి తమ ప్రాధాన్యత ఆధారంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారంలో భాగంగా తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్య యుతంగా, ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న ఈ ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Andhra
వై కోట పంచాయతీలో ముమ్మరంగా సాగిన ఎన్నికల ప్రచారం పాల్గొన్నముక్కా వరలక్ష్మి
Quick Summary:
వై కోట పంచాయతీలో ముమ్మరంగా సాగిన ఎన్నికల ప్రచారం పాల్గొన్నముక్కా వరలక్ష్మి
