రైల్వేకోడూరు అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తా: డాక్టర్ సయ్యద్ అహ్మద్
రైల్వే కోడూరు నవంబర్ 2 మనసులో మాట:
రైల్వేకోడూరు ప్రాంత సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు డాక్టర్ సయ్యద్ అహ్మద్ స్పష్టం చేశారు. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు. రైల్వేకోడూరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి గతంలో చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుంచినట్లు తెలిపారు. దేశ అత్యున్నత కార్యాలయ గ్యాలరీలో తన అంశం ఉండటం, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి స్థాయిలో ఈ ప్రాంతం పేరు చర్చకు వచ్చేలా కృషి చేయడం జరిగిందని వివరించారు.
ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు తావులేకుండా, కేవలం ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. తాను చేసిన సేవలను ఎప్పుడూ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోలేదని, ప్రజల సంక్షేమం కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడబోనని భరోసా కల్పించారు. రైల్వేకోడూరు సుభిక్షంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రజలందరూ కులమతాలు, ఆర్థిక స్థితులు, రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని కోరారు. తనను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా, ఇంటి బిడ్డగా భావించి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వేకోడూరు భవిష్యత్తును మార్చే దిశగా ఒక్క అవకాశం కల్పిస్తే నిబద్ధతతో అభివృద్ధి చేసి చూపిస్తానని డాక్టర్ సయ్యద్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు.
Andhra
రైల్వేకోడూరు అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తా: డాక్టర్ సయ్యద్ అహ్మద్
Quick Summary:
రైల్వేకోడూరు అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తా: డాక్టర్ సయ్యద్ అహ్మద్